పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్.. మెగా స్టార్ డైరెక్ట్ చేసినా ఈ సినిమా తెలుసా?

-

పవర్.. స్టైల్.. రౌద్రం.. రాజసం.. ఇవన్నీ కలగలిపితే మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన. కమర్షియల్‌ సినిమాలకు మరింత కమర్షియాలిటీ తీసుకురావడంలో ఆయనది అందెవేసిన చేయి. అయితే ఆయన నటించిన చిత్రాల్లో ఇంద్రకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఎందుకంటే అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో చాలానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చిత్రాలు వచ్చాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అయితే ఇదే నేఫథ్యంలో వచ్చిన చిరు ఇంద్ర.. పాత చిత్రాలను తలదన్నేలా స్పెషల్ ట్రెండ్ సెట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ తరం వాళ్లు కూడా ఇంద్ర కి ఫిదా అయిపోతుంటారు. ఈ సినిమా నేటితో విడుదలై 20ఏళ్ళు పూర్తి చేసుకున్న నేఫథ్యంలో కొన్ని విశేషాలు మీకోసం…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. 2002 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు.

ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ అన్ని అద్భుతం. ఇక చిరు చెప్పే డైలాగ్స్, అయన వేసే స్టెప్స్, ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే డైలాగ్స్, కామెడీ మాములుగా ఉండదు. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్, ఎమోషన్ సీన్స్ కట్టిపడేస్తాయి.

మెగాస్టార్ కెరీర్ లో మొట్టమొదటి ఫ్యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా చిరుకి మళ్ళీ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

మృగరాజు శ్రీమంజునాథ, డాడీ వంటి చిత్రాలు నిరాశపరచడంతో ఇంద్రపై మొదట పెద్దగా అంచనాలు ఏమీ నమోదు కాలేదు. కానీ ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం… అటు తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది. 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది.

చిత్రం అత్యథిక కలెక్షన్లు నమోదు చేసింది. నిజానికి ఇరవై ఏళ్ళ క్రితమే ‘ఇంద్ర’ చిత్రానికి రూ.17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.28.70 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.11.70 కోట్ల లాభాలు దక్కడం విశేషం.

చిరు డైరెక్షన్… ఈ చిత్రం సెకండ్ హాఫ్ చాలా వరకు చిరునే డైరెక్ట్ చేశారట. వర్షం కురవడానికి యజ్ఞం చేసే సీన్, రిజర్వాయిర్ కోసం చిరు ఆస్తులు త్యాగం చేసే సీన్లు చిరునే డైరెక్ట్ చేశారట. మే నెలలో భయంకరమైన ఎండలు ఉన్నప్పటికీ చిరు.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్ చేశారట. ఈ క్రమంలో యూనిట్ సభ్యులకు, చిన్న ఆర్టిస్ట్ లకు ఇబ్బంది కలిగించినందుకు ఆయన వెళ్లి క్షమాపణలు కూడా చెప్పారట.

ఇక సెకండ్ హాఫ్ లెంగ్త్ చాలా ఎక్కువైతే పరుచూరి బ్రదర్స్ కలిసి ఎడిటింగ్ రూంలో కూర్చొని కత్తెరకు పనిచెప్పారట చిరు. ఇలా ఇంద్ర మూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డారని తెలిసింది.

ఇంకా ఈ సినిమాలో ఉండే పాటలు అద్భుతం.. మణిశర్మ గారు ఈ మూవీకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాటల్లో వర్ణించలేము. ‘దాయి దాయి దామ్మా’ పాటలో చిరు వేసిన స్టెప్పులు కుర్రకారును థియేటర్లలో కూర్చోనివ్వకుండా చేసిందంటే అతిశయోక్తి కాదేమో. ఆడియన్స్ వేసే విజిల్స్, క్లాప్స్ కి థియేటర్ టాప్ లేచిపోయింది.

పాపులర్ డైలాగ్స్….

  • ‘ మీది తెనాలే మాది తెనాలే,
  •  ‘మొక్కే కదా అని పీకేస్తే’
  • షౌవుకత్ అలీఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టీ తల వంచుకొని వెళుతున్నాను, లేకపోతె ఇక్కడనుంచి తళలు తీసుకెళ్లేవాడిని.
  • మీము తెనాల్లోలం తెలుసా తెలివితక్కువోల్లం కాదు.. తేనాలా..! మాది తేనాలే..!
  • ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందం తో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో ,ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలు గా మారతాయో.. ఆయనే ఇంధ్ర సేనా రెడ్డి.
  • ఆయుధం లేకుండా వచ్చినవ్..మా గడప దాటి ఎట్టా పోతావ్..
  • ఆయుధం మీక్కావాలి రా..నాకు.. (చెయ్యి) చాలు. నరుకుతా..సయ్యంటే సెకండుకో హెడ్ తీసుకోల్తా ..ఇంద్ర.. ఇంద్ర సేన రెడ్డి.
  • సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ  ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది..
  • రావాలి అనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యపోతరేంటీ..రానానుకున్నారా రాలేననుకున్నారా..
  • కాసికి పోయాడు.. కాషాయం మనిషైపోయాడు అనుకుంటున్నారా,వారణాసిలో బతుకుతున్నాడు తన వరసులు మార్చి ఉంటాడు అనుకుంటున్నారా.. అదే రక్తం అదే పౌరుషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version