నెలకు రూ.2000 కట్టండి… లక్ష రుణం పొందండి.. !!

-

ప్రజలను ఆకట్టుకునేలా ఈ పండుగ సీజన్ లో అన్ని రకాల ప్రైవేట్ బ్యాంకులు, షాపింగ్ మాల్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు డిస్కౌంట్లు ఆఫర్లు అందించడానికి ముందుకు వచ్చాయి.అలాగే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో బ్యాంక్ కూడా కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు తన కస్టమర్ల కోసం దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ అని ఆఫర్‌ తీసుకువచ్చింది.

money

ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ తన కస్టమర్లకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. అయితే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు అనేది 6.90 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఒకవేళ మీరు వెహికల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.99 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. వెహికల్ ఆన్‌ రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ రూపంలో పొందొచ్చు. అలాగే టూవీలర్ లోన్ తీసుకునే వారికీ కూడా తక్కువ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంది.

అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వెస్ట్‌సైడ్, శాంసంగ్, టాటా క్లిక్, డీమార్ట్ వంటి వాటిల్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే మనకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంకా జీరో పప్రాసెసింగ్ ఫీజు, జీరో డౌన్‌ పేమెంట్ వంటి ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి.అయితే ఆరు నెలల కాల పరిమితితో తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

అలాగే యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కూడా కలదు. పెర్సనల్ లోన్ కావాలనుకునే వారికీ వారికి వడ్డీ రేటు 10.49 నుంచి ప్రారంభమౌతుంది. రూ.లక్షకు ఈఎంఐ రూ.2,149గా ఉంది. అలాగే ఎడ్యుకేషన్ లోన్‌పై కూడా వడ్డీ రేటు 10.5 శాతంగా ఉంది. బిజినెస్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజులో 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.ఇంకా ఎందుకు ఆలస్యం ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.. ఆన్లైన్ లో షాపింగ్ చేసే వారికీ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తో డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు మీద 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.. !!

Read more RELATED
Recommended to you

Exit mobile version