రివైండ్ 2024: ఆ హీరోయిన్లను టాలీవుడ్ మర్చిపోయిందా..?

-

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. భారతీయ సినిమా పరిశ్రమకు ముఖచిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మారుతోంది. ఈ తరుణంలో తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే చాలా తక్కువ మంది మాత్రమే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్న.

ఆమె గురించి వదిలేస్తే ఈ సంవత్సరం కొంతమంది హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. వాళ్లలో మొదటగా చెప్పుకోవాల్సింది పూజ హెగ్డే గురించి.

పూజా హెగ్డే:

పూజా హెగ్డే చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమాలో ఒకానొక పాటలో అతిథి పాత్రలో కనిపించారు. నిజానికి 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారంలో ఆమె కనిపించాల్సింది. చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరొకరు వచ్చారు.

మరి ఈ సంవత్సరమైనా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తారేమో చూడాలి.

కీర్తి సురేష్:

మహానటి సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కాకపోతే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి అనే కారుకు తన గొంతును అందించారు. కీర్తి సురేష్ నటించిన రఘుతాత చిత్రం ఇదే సంవత్సరం తమిళంలో విడుదలైంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కాం కదా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

రాశీ ఖన్నా:

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది. అయితే ఆమెకు అడపాదడపా విజయాలు వచ్చాయి. గత సంవత్సరం నుండి రాశీ ఖన్నా తెలుగులో కనిపించడమే మానేసింది. ఈ సంవత్సరం ఆమె నుంచి ఒక్క సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కాకపోతే ఆమె నటించిన యోధ, ద సబర్మతి రిపోర్ట్ చిత్రాలు హిందీలో, అరణ్మనాల్ చిత్రం తమిళంలో విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news