అక్కడ పెళ్లికిముందు వరుడికి వధువు తండ్రి 21 విషపూరితమైన పాములను బహుమానంగా ఇస్తారంట..!

-

పెళ్లంటే కట్నకానుకలు అంటూ వధువుకు వరుడు తరుపున వాళ్లు, వరుడికి వధువు తరుపున వాళ్లు వాళ్లస్థాయికి తగ్గట్టు ఏదో ఇస్తుంటారు. ఇది మనందరికి తెలిసిన విషయమే. వరుడికి ఏ బైకో, బ్రాస్లైటో లాంటివి ఇస్తారు. కానీ వరుడుకి పెళ్లికూతురు తం‍డ్రి 21 విషపూరితమై పాములను కానుకగా ఇవ్వాలంట. ఇది అక్క‍డ ఆచారమట. అసలు పాము అంటేనే మనందరికి విపరీతమైన భయం. అందులోనూ ఫూల్లీ పాయిజన్ ఉండే పామునే వరుడికి ఇవ్వడమేంటి. ఇదెక్కడి ఆచారంరారా బాబూ అనిపిస్తూందా..! ఎక్కడి ఆచారమో చూద్దాం.
snaks as dowry
మనదేశంలో వివిధ మతాలు, వివిధ తెగలు, వివిధ బాషాలవాళ్లు జీవిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం, సంప్రదాయం. కానీ కొన్ని సంప్రదాయాలు చూస్తే చాలా వింతంగా అనిపిస్తుంది. ఆచారాల పేరిట వీళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారేంట్రా అనిపిస్తుంది. బతికున్న పామును తినటం మా ఆచారం అంటారు ఒకరు.. విషపూరితమైన పామునే పెళ్లికొడుకుకి ఇవ్వటం మా ఆచారం అంటున్నారు చత్తీస్గడ్ లోని మహాస్ మండ్ జిల్లా జోగినగర్ గ్రామ ప్రజలు.
పెళ్లికూతురు తండ్రి మాత్రమే వరుడికి ఈ పాములను బహుకరించాల్సి ఉంటుంది. ఈ రకమైన సంప్రదాయం కేవలం పెళ్లి సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు పాటిస్తారట. ఒకవేళ పెళ్లి కూతురు తండ్రి దగ్గర 21 విషపూరిత పాములు లేనట్లయితే ఇరుగుపొరుగు లేదా బంధువుల దగ్గరి నుండి అప్పుగా తీసుకోవాలంట.. వివాహాం తరువాత అప్పుగా తెచ్చుకున్న పాములను తిరిగి వారికి అప్పగించాలి. ఇలాంటి వింత ఆచారాలు ప్రపంచ వ్యాప్తంగా చెలానే ఉన్నాయి.
ఒకవేళ గ్రామంలో ఏదైనా కారణం చేత పాము చనిపోతే.. ఊరందరిని పిలిచి, భోజనాలు పెట్టించి ఒక పెద్ద కార్యక్రమంలాగా జరిపించటం అక్కడి సాంప్రదాయం. మనం మన బంధువులు చనిపోతే ఎలాఅయితే ఇలాంటి కర్మలు చేసి భోజనాలు పెడతామో అక్కడివారు పాము చనిపోతే ఇలా చేస్తారు.. అంతేకాదు ఒకవేళ పాములు కలిగి ఉన్న యజమాని ఏదైనా పాము చనిపోతే మీసాలు, గడ్డం తీసేయాల్సి వస్తుంది.
కంప్యూటర్ కాలంలోనూ ఇలాంటి సంప్రదాయాలను వారు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. పాములు ఎంత విషపూరితమో తెలిసినప్పటికీ ఇంట్లోనే పెంచటం వారి పురాతనకాలం నుండి వస్తున్న ఆచారమట. అయితే వారు పెంచే పాములు అంతరిస్తున్న కారణంగా ఇంట్లో పాములు పెంచటాన్ని అక్కడి అటవీశాఖ నిషిధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version