హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షీంచుకుంటున్నారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ లకు ఆఖరి రోజైన నేడు మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి టి.ఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, టీడీపీ నుంచి కిరణ్మయి, బీజేపీనుంచి రామారావు బరిలో ఉన్నారు.
సిపిఎం అభ్యర్ధి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. మొత్తానికి బరిలో 28 మంది నిలిచారు. ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగనుంది. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నఅభ్యర్ధులకు గుర్తులను కేటాయించనున్నారు.. గత ఎన్నిక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆటో, ట్రక్కు గుర్తులను డిలిట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు.