మూర్ఖపు డ్రైవర్ దెబ్బకు ఘోర ప్రమాదం.. 28 మందికి తీవ్ర గాయాలు

-

ఉత్తరప్రదేశ్‌ లో కొద్ది సేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. భడోహిలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ఆపి ఉన్న ఒక ట్రక్కును బలంగా ఢీకొనడంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 16 మందిని చికిత్స కోసం వారణాసికి పంపించగా, అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌కు చెందిన ఝాన్సీ డిపోకు చెందిన బస్సు వారణాసికి వెళుతుండగా జాతీయ రహదారి నెంబర్ 2లో ఆదివారం ఈ ప్రమాదం జరిగిందని గోపిగంజ్ ఎస్‌హెచ్‌ఓ కృష్ణంద రాయ్ తెలిపారు.

డ్రైవర్ బస్సు బయలుదేరినప్పుడు నుండి మూర్ఖంగా చాలా వేగంగా బస్సును నడుపుతున్నాడని, తాము పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వేగాన్ని మాత్రం  తగ్గించలేదని ప్రయాణికులు తెలిపారు. అతి వేగంగా ఉన్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది అని వారు తెలిపారు. గాయపడిన 16 మందిలో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ కూడా ఉన్నారు. దీపావళి వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళుతున్న 11 మంది మహిళలు సహా 42 మంది ప్రయాణికులతో ఈ బస్సు ప్రయాణిస్తున్నది, 28 మంది మినహా మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version