సంగారెడ్డిలో దారుణం : చనిపోయిన మహిళ తిన్న ఆహారం తిని ముగ్గురు మృతి !

-

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మం పల్‌వట్లలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని చికిత్స కోసం హైదరాబాద్‌ కు తరలించారు. నిన్న రాత్రి  జొన్న రొట్టెలు తిన్న ఐదుగురు కుటుంబ సభ్యులలలో ముగ్గురు చనిపోయారు. 15 రోజుల క్రితం ఇదే కుటుంబంలోని శంకరమ్మ అనే మహిళ మృతి చెందింది.

శంకరమ్మ దిన కర్మ లో పాల్గొవడానికి వచ్చిన కుమారులు, కోడళ్లు చనిపోయిన మహిళ వినియోగించిన జొన్నపిండి తోనే రొట్టెలు చేసి తిన్నట్టు చెబుతున్నారు. ఆ జొన్నపిండిలో విషపదార్థం కలిసినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. వీరశైవ లింగాయత్ లు కావడంతో బియ్యం, పిండి గ్రామస్తుల నుంచి సేకరిస్తారని అంటున్నారు. వాటిని తినడం వల్లనే పది రోజుల క్రితం శంకరమ్మ, ఈ తెల్లవారుజామున ఆమె కుటుంబ సభ్యులు చనిపోయారని భావిస్తున్నారు గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version