ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగులకు బాగా అలవాటు పడ్డాడు. గేమ్స్ కోసం భారీగా అప్పులు చేశాడు. సుమారు బెట్టింగ్ యాప్స్‌లో రూ. 30 లక్షల వరకు కోల్పోయినట్లు సమాచారం.
చేసిన అప్పులు తీర్చలేక, బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన రాజ్‌కుమార్.. ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్ మరణంతో ఇల్లంద గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.