ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ మైక్రో చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజ మీద అద్బుతాన్ని సృష్టించాడు. నేడు రంజాన్ పండుగ సందర్భంగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు.
బియ్యపు గింజలో ఒక ముస్లిం.. అల్లాకు ప్రార్ధన చేస్తున్నట్లు, నెలవంక, నక్షత్రం సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, కోటేశ్ టాలెంట్, పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సర్వమత సమ్మేళనానికి ఇది అద్దం పడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
బియ్యపు గింజపై రంజాన్ చిత్రం..
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు.
బియ్యపు గింజలో ఒక ముస్లిం.. అల్లాకు ప్రార్ధన చేస్తున్నట్లు, నెలవంక, నక్షత్రం సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్… pic.twitter.com/lISrbq5rQL
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025