బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ఎం రమేశ్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ నియామకం అయ్యారు.
ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ లో కేసులు నమోదు అయింది. 25 మంది యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్లు, టాలీవుడ్, బాలీవుడ్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు అయింది. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించిన డీజీపీ జితేందర్…. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.