పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి : క్రైస్తవ సంఘాల నిరసన

-

ఏపీలో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, దాని వెనుక కుట్రకోణం దాగి ఉందని క్రైస్తవ సంఘాలు అనుమానిస్తున్నాయి. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు.ప్రవీణ్ మృతిపై న్యాయం చేయాలని కాకినాడ కలెక్టర్‌కు క్రైస్తవ సంఘ నాయకులు రెప్రజెంటేషన్ అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version