పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని మంథని జూనియర్ కళాశాల మైదానంలో సుమారు 30 మంది కరాటే నేర్చుకునే పిల్లలు, వాకర్స్, క్రీడాకారుల పై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు.
కళాశాల మైదానంలో చెట్లపై తేనెటీగల స్థావరం ఉండగా..ఏం జరిగిందో తెలీదు. అనుకోకుండా తేనెటీగలు ఒకసారిగా కరాటే నేర్చుకునేందుకు వచ్చి న ఓ బాలుడిపై దాడి చేశాయి.అదే సమయంలో చుట్టుపక్కల వారు బాలుడిని కాపాడడానికి ప్రయత్నం చేయగా వారిని కూడా తేనెటీగలు గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.
https://twitter.com/TeluguScribe/status/1889163889708843447