క్యాన్సర్ కి దూరంగా ఉండాలా? అయితే వీటిని తీసుకోకండి..!

-

ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. వాటిలో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్ లో ఎన్నో రకాలు ఉంటాయి మరియు మన దేశంలో క్యాన్సర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అంతేకాక క్యాన్సర్ వలన మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుంది. కనుక జీవన విధానం మరియు తీసుకునేటువంటి ఆహారాన్ని మార్చుకోవడం వలన క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

ప్రాసెస్ చేసినటువంటి మాంసాన్ని తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మాంసాన్ని ప్రాసెస్ చేయడం వలన క్యాన్సర్ కు దారి తీసే గుణాలు పెరుగుతాయి. వీటికి బదులుగా తాజాగా అందుబాటులో ఉండేటువంటి సాల్మన్ వంటి చేపలను తీసుకోవచ్చు. శాఖాహారులు అయితే క్యారెట్, బీట్రూట్ వంటివి తీసుకుంటే యాంటీ క్యాన్సర్ గుణాలు పెరుగుతాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఫైబర్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

డీప్ ఫ్రై చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. అంతేకాక అధికంగా చక్కెరను ఉపయోగించి తయారు చేసేటువంటి పేస్ట్రీస్, స్వీట్స్, కుకీస్ వంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. దీని వలన ఉబకాయం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాక క్యాన్సర్ కణాల ఎదుగుదల పై కూడా ప్రభావం ఉంటుంది కనుక ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. క్యాబేజీ, బ్రోకోలి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. కనుక తరచుగా మీ రోజు వారి ఆహారంలో వీటిని తీసుకోండి. క్యాన్సర్ ముప్పు తగ్గాలి అంటే కచ్చితంగా ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలు మరియు క్యాన్సర్ తీవ్రత ఎంతో త్వరగా పెరుగుతుంది. కనుక వీటికి దూరంగా ఉండడం ఎంతో అవసరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version