గ్రేటర్ పరిధిలో 30 శాతం సర్వే జరగలేదు : తలసాని శ్రీనివాస్ యాదవ్

-

గ్రేటర్ పరిధిలో 30 శాతం సర్వే జరగలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తాజాగా కులగణన సర్వే పై చర్చలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఫార్మాట్ మార్చి మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సర్వేలో బీసీ, ఎస్టీ, ఎస్సీ జనాభా సర్వే తగ్గినట్టు చూపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా సర్వే చేపట్టారని చెబుతున్నారు.

సర్వే కోసం 57 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అనేక అంశాలు ఉండటంతో చాలా మంది సర్వేలో పాల్గొనలేదు.  కానీ అన్ని అంశాలు అవసరం లేదని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 3కోట్ల 54 లక్షల మంది ఉన్నారు. అయితే 14 ఏళ్లలో 14 లక్షల జనాభానే పెరిగిందా..? అని ప్రశ్నించారు తలసాని. తీర్మాణం చేసి ఢిల్లీకి పంపించకుండా చట్టబద్దత చేయాలని కోరారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news