31 people arrested at Bengaluru rave party: బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఈ బెంగళూరు రేవ్ పార్టీలో 31 మంది అరెస్ట్ అయ్యారు. దేవనహళ్లి సమీపంలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఏడుగురు యువతులు సహా 31 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

అందరూ ఐటీ ఉద్యోగులుగా గుర్తించారు పోలీసులు. నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు అయింది. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో 31 మంది అరెస్ట్ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.