కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. ఈ సారి అవకాశం కల్పించాలని కోరారు మల్ రెడ్డి రంగారెడ్డి.

పీసీసీ కార్యవర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70 శాతం వరకు అవకాశం ఉంది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలు ఉన్నారు. రోహిత్ రెడ్డి, సంపత్ కుమార్, బలరాం నాయక్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉంది. మైనార్టీల జాబితాలో ఫయూమ్ లేదా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఉంది.