గణేశుడు నిమజ్జనాలు తెలంగాణలో నిన్న జరిగాయి. కొన్ని గణేశుడి నిమజ్జనాలు పూర్తికాగా మరికొన్ని విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. గణేశుడి నిమజ్జనానికి ముందు 11 రోజులపాటు గణపతి చేతిలో పూజలు అందుకున్న లడ్డును వేలం నిర్వహిస్తారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. కొన్ని ప్రాంతాలలో లడ్డు లక్షలలో వేలలో పలకగా మరికొన్ని ప్రాంతాలలో వేలలోనే అమ్ముడైంది.

తాజాగా హైదరాబాద్ కొత్తపేటలో 33 కిలోల లడ్డును కేవలం 99 రూపాయలకే ఓ విద్యార్థి సొంతం చేసుకున్నాడు. ఓ గణేషుడి వద్ద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డు కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో 760 టోకెన్లను విక్రయించారు. ఇందులో విద్యార్థికి అదృష్టం కలిసి వచ్చింది. లక్కీ డ్రాలో గెలుపొంది ఆ భారీ లడ్డూను రూ. 99కే కైవసం చేసుకున్నాడు. కాగా ఆ లడ్డును విద్యార్థికి అందించి ఫోటోలు తీసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.