ఎక్కువమంది పనిలో బిజీగా ఉన్నప్పుడు, లేదా ప్రయాణాల్లో సరైన టాయిలెట్ సౌకర్యాలు లేనప్పుడు మూత్రాన్ని ఆపుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయంలా అనిపించిన దీర్ఘకాలికంగా మూత్రాన్ని ఆపుకోవడం చాలా ప్రమాదకరం. ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. మూత్రం అనేది శరీరంలోని వ్యద్దపదార్థాలను బయటకు పంపే ఒక ప్రక్రియ దాన్ని ఆపడం వల్ల ఆ వ్యర్ధాలు శరీరంలో పేరుకు పోయి అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. ఈ అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI): మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రశయంలో బ్యాక్టీరియా పేరుకు పోతుంది. ఈ బాక్టీరియా మూత్రాశయం గోడలను అంటుకొని ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. దీన్నే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం అంటే లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ సమస్యలు: మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయం నిండిపోయి, ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి మూత్రపిండాలకు కిడ్నీలకు వ్యతిరేక దిశలో ప్రవహించేలా చేస్తుంది. దీన్నివెసికోయురెటరల్ రిఫ్లక్స్ అంటారు. ఈ పరిస్థితి వల్ల మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్లు చేరి,కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారి తీయవచ్చు. మూత్రంలో ఉండే ఖనిజాలు ,వ్యర్థ పదార్థాలు ఎక్కువ సేపు మూత్రాసయం లో నిండిపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.

మూత్రశయం స్పేరింగ్ (Urinary Spasms): యూరియల్ ట్రాక్ నిండినప్పుడు అది బలహీనమైన స్పందనను విడుదల చేస్తుంది. ఈ స్పందన కొన్ని సార్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. అంతేకాక ఎక్కువసార్లు మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయం కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల మూత్ర సయం సాగే గుణం కోల్పోతుంది. దాని ఫలితంగా మూత్రాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం మూత్రశయం నిండినట్లుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మీకు తరచుగా ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.