దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల ద్వారా చాలా మందికి ప్రయోజనం కలగనుంది. స్టేట్ బ్యాంక్ రుణాలు కూడా ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్ నుంచి అర్హత కలిగిన వారు సులభంగానే లోన్ పొందొచ్చు. లోన్ పొందే అవకాశాన్ని బ్యాంకు కల్పిస్తోంది.
ఈ లోన్ ని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ యోనో యాప్ ద్వారానే ఈజీగా పొందొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్ లోనే డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేసేయచ్చు. యోనో ద్వారా ఏకంగా రూ. 35 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతా లో పడతాయి. ఫిజికల్ డాక్యుమెంట్ల తో కూడా పని లేదు. ఇక ఎలా లోన్ వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.
ఈ లోన్ ని పొందడానికి మొదట ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చెయ్యాల్సి వుంది.
ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
ఆ తరవాత లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు ఓటీపీ ని ఎంటర్ చేయాలి.
ఎంపిన్ సెట్ చేసుకోవాలి.
ఆ తర్వాత టాప్ లెఫ్ట్‌లో ఉన్న మెనూ మీద నొక్కండి.
లోన్స్ అనే ఆప్షన్ ని ఇప్పుడు ఎంచుకోవాలి.
పర్సనల్ లోన్స్‌పై క్లిక్ చేసి రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్లై నౌ పై క్లిక్ చేయాలి.
రూ. 35 లక్షల వరకు లోన్ వస్తుంది,