ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు దఫాలుగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 2 నుండి 20 రోజులపాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. అంతేకాకుండా.. ఈనెల 21 నుండి నియోజకవర్గాల్లో ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట బైక్ ర్యాలీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు బీజేపీ నేతలు. రేపు కరీంనగర్ లో సంజయ్ ‘మౌన దీక్ష’ చేపట్టనున్నారు. పోడు భూములు, ధరణి సమస్యలపై రేపు కరీంనగర్ లో బండి సంజయ్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ‘మౌన దీక్ష’ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా ఈనెల 21 నుండి ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహించ తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని, రాత్రి పూట
పల్లెల్లోనే బస ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో ఆగస్టు 9 నుండి 15 వరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త నివాసాలపై జాతీయ జెండాను ఎగరేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.