వైరల్‌ వీడియో : వామ్మో..! అర్ధరాత్రి టాయిలెట్‌కు వెళ్తే.. బాత్‌రూంలో పెద్ద మొసలి కనిపించింది..!

-

అర్ధరాత్రి పూట టాయిలెట్ చేయడం కోసమని వాష్‌రూమ్‌కు వెళితే.. అక్కడ పెద్ద మొసలి కనిపిస్తే ఎలా ఉంటుంది ? తలచుకోవడానికే చాలా భయం వేస్తుంది కదా. అవును.. ఆ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

అర్ధరాత్రి పూట టాయిలెట్ చేయడం కోసమని వాష్‌రూమ్‌కు వెళితే.. అక్కడ పెద్ద మొసలి కనిపిస్తే ఎలా ఉంటుంది ? తలచుకోవడానికే చాలా భయం వేస్తుంది కదా. అవును.. ఆ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే వెంటనే వన్యప్రాణి సంరక్షణ కేంద్ర సిబ్బందిని పిలవడంతో కథ సుఖాంతమైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

వడోదరలో నివాసం ఉండే మహేంద్ర పదియార్ మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో చప్పుడు కావడంతో అతనికి మెళకువ వచ్చింది. దీంతో టాయిలెట్ దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే అక్కడ ఒక పెద్ద మొసలి అతనికి కనిపించింది. అది సుమారుగా నాలుగున్నర అడుగుల పొడవు ఉండడంతో ఒక్కసారిగా అతనికి వెన్నెపూసలో వణుకు మొదలైంది. అంతటి మొసలిని చూసే సరికి అతను భయభ్రాంతులకు లోనయ్యాడు. దీంతో వెంటనే అతను సమీపంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్ర సిబ్బందికి ఫోన్‌లో సమాచారం అందించగా.. వారు వెంటనే అతని ఇంటికి వచ్చి ఒక గంట పాటు కష్టపడి ఆ మొసలిని ఎట్టకేలకు బంధించి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆ మొస‌లి అక్క‌డికి స‌మీపంలో ఉన్న విశ్వ‌మిత్రి న‌ది నుంచి వ‌చ్చి ఉంటుంద‌ని స‌ద‌రు సిబ్బంది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version