హర్యానాలోని నూహ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న నలుగురు అక్క చెల్లెళ్ళను గొంతు కోసి చంపినట్టు గుర్తించారు. అయితే ఈ నేరానికి పాల్పడినట్లు వారి తల్లిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ పిల్లల తండ్రి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తీవ్రంగా గాయపడి తరువాత ఆసుపత్రిలోని ఐసియులో చేరిన తల్లిపై కేసు నమోదైందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పున్హానా పోలీస్ స్టేషన్, పిప్రోలి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. 1-7 సంవత్సరాల వయస్సు గల నలుగురు బాలికలని గొంతు కోసి చంపారు. ఈ నలుగురిని వారి తల్లి చంపి తర్వాత ఆమె గొంతు కోసుకున్నట్లు భావిస్తున్నారు, ఆమెను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరియు ఐసియులో చేర్చారు అని పోలీసులు చెబుతున్నారు. యా మహిళ ఎందుకు అలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.