మా అమ్మ ఆరోగ్యంగా ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ప్రకటన

-

మెగాస్టార్ చిరంజీవి  తల్లి అంజనా దేవీ అస్వస్థతకు గురయ్యారంటూ గతకొన్ని రోజులు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి.

రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని.. ఆసుపత్రిలో చేరిందని అంటున్నారు. అందుకే అభిమానులు, శ్రేయాభిలాషులతో పాటు మీడియాకు ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. ఆమె చాలా ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. దయచేసి అన్ని అన్ని మీడియా సంస్థలు గమనించగలరు’ అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news