క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లను మీరు వాడుతున్నారా..? అయితే మీ ఫోన్‌కు హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. సదరు ప్రాసెసర్లు కలిగిన ఫోన్లలో ఉన్న లోపాల వల్ల హ్యాకర్లు ఆ ఫోన్లపై అటాక్ చేసే అవకాశం ఉందని.. చెక్‌పాయింట్ అనే టెక్నాలజీ కంపెనీకి చెందిన రీసెర్చర్లు తెలిపారు. వారు క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన ప్రాసెసర్లు కలిగిన ఫోన్లలో సుమారుగా 400 వరకు సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. క్వాల్‌కామ్ చిప్స్‌లోని డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్‌లో ఆ లోపాలు ఉన్నట్లు గుర్తించామని చెక్‌పాయింట్ రీసెర్చర్లు తాజాగా వెల్లడించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో సుమారుగా 40 శాతం ఫోన్లలో క్వాల్‌కామ్ ప్రాసెసర్లే ఉంటున్నాయి. అందువల్ల కోట్ల కొద్దీ ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని రీసెర్చర్లు తెలిపారు. ముఖ్యంగా గూగుల్, శాంసంగ్, ఎల్‌జీ, షియోమీ తదితర అనేక ఫోన్లలో క్వాల్‌కామ్ ప్రాసెసర్లను ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ఆయా ఫోన్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.
క్వాల్‌కామ్ ప్రాసెసర్లు కలిగిన ఫోన్లలో ఉన్న 400 సాంకేతిక లోపాల వల్ల హ్యాకర్లు ఆయా ఫోన్లపై సులభంగా అటాక్ చేస్తారని రీసెర్చర్లు తెలిపారు. దీంతో వారు యూజర్ల ఫోన్లలో ఉండే ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, రియల్‌టైం మైక్రోఫోన్ డేటా, జీపీఎస్, లొకేషన్ తదితర వివరాలను సులభంగా చోరీ చేస్తారని తెలిపారు. అలాగే వారు మాల్‌వేర్లను ఆ ఫోన్లలోకి చొప్పించి ఫోన్లను పనిచేయకుండా ఫ్రీజ్ చేయగలరని అన్నారు. దీంతోపాటు ఫోన్‌ను పర్మినెంట్‌గా వాడకుండా బ్లాక్ చేస్తారని అన్నారు. ఇక ఇతర యాప్స్‌ను ఫోన్లలో మనకు తెలియకుండానే ఇన్‌స్టాల్ చేసి వాటి సహాయంతో మనం ఫోన్‌లో చేసే కార్యకలాపాలపై నిఘా పెడతారని, మన సమాచారాన్ని వారు తస్కరిస్తారని కూడా హెచ్చరించారు.
అయితే దీనిపై ఇప్పటికే క్వాల్‌కామ్‌తోపాటు ఫోన్ తయారీ సంస్థలను కూడా హెచ్చరించామన్నారు. ఈ క్రమంలో ఫోన్ల యూజర్లు తమకు తమ ఫోన్ తయారీ కంపెనీలు అందించే నూతన సెక్యూరిటీ అప్‌డేట్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అలాగే గూగుల్ ప్లే స్టోర్ తప్ప ఇతర థర్డ్ పార్టీ యాప్‌లను ఎట్టి పరిస్థితిలోనూ ఇన్‌స్టాల్ చేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు క్వాల్‌కామ్ కూడా దీనిపై స్పందిస్తూ.. యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.