బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు పెంచాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ కులగణన చేపట్టిందని,ఆ నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ పెడుతోందన్నారు.అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కుల గణనకు తెర లేపిందని, నేడు అసెంబ్లీలో చర్చ పెడుతోందని విమర్శించారు.బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు పెంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. అవి పక్కన పడేసి కులగణన పేరుతో ఇన్నాళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. బీసీలపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, నిజంగా ఉంటే కేబినెట్లో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులు దక్కాయో చెప్పాలని డిమాండ్ చేశారు.