కరోనా లాక్‌డౌన్ వల్ల అధిక శాతం మంది ఇండ్ల నుంచే పని చేస్తున్నారు. ఇక విద్యార్థులకు, ఇతర అనేక మందికి పలు అవసరాల కోసం కంప్యూటర్లు కావల్సి వస్తున్నాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది డెస్క్‌టాప్‌లకు బదులుగా ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. పవర్ బ్యాకప్ అధికంగా ఉండడం, ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉండడంతో చాలా మంది ల్యాప్‌టాప్‌లను కొంటున్నారు. అయితే వాటిల్లో చవక ధరలకు లభించే ల్యాప్‌టాప్‌ల వివరాలను కింద అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..!
1. లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145
ఇందులో 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. 4జీబీ ర్యామ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ ఐదున్నర గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. దీని ధర రూ.29,990.
2. అసుస్ వివోబుక్ 14
ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. ఫుల్ సైజ్ చిక్‌లెట్ కీబోర్డు, ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఐ3 ప్రాసెసర్, విండోస్ 10 ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. దీని ధర రూ.31,990గా ఉంది.
3. అసుస్ వివోబుక్ 15
ఇందులో విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. దీని ధర రూ.29,999.
4. ఏసర్ ఆస్పైర్ 5
దీంట్లో 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంలను అందిస్తున్నారు. దీని ధర రూ.36,990.
5. హెచ్‌పీ 14 ఇంచుల ల్యాప్‌టాప్
ఇందులో విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం, 14 ఇంచుల డిస్‌ప్లే, ఏఎండీ రేడియాన్ ఆర్3 గ్రాఫిక్స్, 4జీబీ ర్యామ్, 2.3 గిగాహెడ్జ్ ఏఎండీ ప్రాసెసర్‌లను అందిస్తున్నారు. దీని ధర రూ.22,163.