సెలూన్‌లో మొక్కులు చెల్లిస్తున్న భక్తులు.. ఎందుకంటే..!

-

కరోనా భయం క్రమక్రమంగా తగ్గుతున్న కొద్ది ప్రజలు రోడ్డెక్కుతున్నారు.. ఈ దశలో లాక్‌డౌన్‌లో కూడా సడలింపులు జరిగాయి.. అందుకే అన్ని సంస్దలతో పాటుగా ఆలయాలకు కూడా అనుమతులు లభించగా భక్తులు రెడి అయ్యారు దర్శనాలకు.. ఇక ఈ వేసవిలో ఎన్నో ఆలయాలను సందర్శించి తమ మొక్కులు చెల్లించుకోవాలనుకున్న భక్తులకు నిరాశే మిగిలింది.. కరోనా వచ్చి అందరి ఆశల మీద నీళ్లు చల్లింది..

అందుకే ఎక్కడివారు అక్కడ గప్ చుప్ అయిపోయారు.. కానీ ఇప్పుడు క్రమక్రమంగా బయటకు వస్తున్నారు గానీ ఒక్కటి మాత్రం అందరు గుర్తు పెట్టుకోవాలి.. ఇప్పుడు మనకుటుంబంలోకి కొత్తగా కరోనా అనే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు.. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడు మనతోనే ఉంటానని ఫిక్స్ అయిపోయాడు.. అందుకే వాడికి చిక్కకుండా చాలా జాగ్రత్తగా, అంటే ఒక మనిషి తన జీవితకాలంలో లేనంతటి భద్రతతో జీవిస్తేనే కొత్త సంవత్సరం వేడుకలును చూడగలుగుతాం.. లేదంటే నూతన సంవత్సరం వరకు పాతబడిపోతాం.. అంటే అర్ధం చేసుకోండి..

ఇకపోతే భక్తుల తాకిడితో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నిండిపోతుందట.. రోజు రోజుకు దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తలనీలాలను మొక్కుకున్న భక్తుల కష్టాలు అన్నీ ఇన్ని కావు.. ఎందుకంటే కొండపైన కల్యాణ కట్ట లేకపోవడంతో దగ్గర్లోని ప్రైవేట్ సెలూన్‌లలో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారట.. మరోవైపు ఘాట్ రోడ్ నుంచి పైకి చంటి పిల్లలతో వచ్చే భక్తులను సిబ్బంది అనుమతించడం లేదంటున్నారు.. ఇక భక్తుల్లారా దేవుడు ఎక్కడికి వెళ్లరు అక్కడే ఉంటారు.. కాబట్టి కాస్త కరోనా ఉంది చూసుకుని ప్రయాణాలు చేయండని నెటిజన్స్ అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version