భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది.తెలంగాణలో ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు విజయ్ అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.మహారాష్ట్ర దగ్గర కేంద్రీకృతమైన ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయని పేర్కొంది.
ఉమ్మడి ఆదిలాబాద్,వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది.గత రెండు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి.44 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ 9న అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే ఐదు రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది సమయానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని ,జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చెప్పింది. దక్షిణాదితో పాటు,నైరుతిప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలుపడతాయని తెలిపింది.