Hyd: కృష్ణాష్టమి వేడుకలలో తీవ్ర విషాదం.. 5 గురు మృతి!

-

కృష్ణాష్టమి వేడుకలలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందింది. హైదరాబాద్-ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లోని యాదవ్ సంగం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రథం బండిపై ఊరేగించారు.

crime
crime

ఇక ఈ ఊరేగింపు ముగింపు సమయంలో రథం బండిని లోపలకి తోసుకుంటూ 9 మంది వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకడంతో షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు: కృష్ణ యాదవ్ ( 24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news