జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రోడ్లపైకి ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు.

అయితే ఇప్పటికే ఒక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. కానీ ఈ విషయంలో ఏ మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తగ్గడం లేదు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాలని.. డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.
జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఒక న్యాయం ? చంద్రబాబు భార్య భువనేశ్వర్ కి ఒక న్యాయమా ? వెంటనే టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.