ఐదుగురి ప్రాణాలు తీసిన సిగ్నల్ జంపింగ్

-

గచ్చిబౌలిలో ఈ ఉదయం జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. సిగ్నల్ జంప్ చేయడమే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు తీసినట్లు గుర్తించారు.  రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ అతివేగంగా వెళ్లే ప్రయత్నం చేయగా  గ్రీన్ సిగ్నల్ లో ఎదురుగా వస్తున్నా  టిప్పర్ ని ఢీకొన్నట్టు అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడిని ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఐదుగురు యువకులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో ఉంటున్నట్టు గుర్తించారు. ఐ ఐ.ఐ.టి చౌరస్తా నుండి గౌలిదొడ్డి వెళ్లే చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదానికి సిగ్నల్ జంపింగ్ ఏ ప్రధాన కారణమని చెబుతున్నారు పోలీసులు. ఏపీ39ed 5229 కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులలో ముగ్గురిని కాట్రగడ్డ సంతోష్ , చింత మనోహర్ , పప్పు భరత్ లుగా గుర్తించిన అధికారులు మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సిన ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version