మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడి వైద్యులు కరోనా వైద్యం చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా వైరస్ కి చికిత్స చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. అందుకనే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ ఆస్పత్రి వైద్యులకు కూడా బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 తో మరణించే ప్రైవేట్ వైద్యులకు బీమా రక్షణ అందిస్తూ నిర్ణయం వెల్లడించింది.
కరోనా సోకి మరణించే ప్రైవేట్ వైద్యులకు రూ .50 లక్షల బీమా రక్షణను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం విడుదల చేసిన సర్క్యులర్లో, రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ సాధన తాయ్డే మాట్లాడుతూ, ప్రభుత్వ మరియు పాక్షిక ప్రభుత్వ సేవల్లోని వైద్యులకు ఇస్తున్న బీమా రక్షణ ఇప్పుడు ప్రైవేట్ వైద్య నిపుణులకు కూడా విస్తరించామని మీడియాకు చెప్పారు.