టాలీవుడ్ కు బిగ్ షాక్.. ఇక ఏపీ థియేట‌ర్లలలో 50 శాతం ఆక్యుపెన్సీ

-

ఏపీలో ఇవాల్టి నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమలు కానుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేట‌ర్లు నడువనున్నాయి. మాల్స్, దుకాణాల్లో, వ్యాపార స‌ముదాయాల్లో కోవిడ్ ఆంక్ష‌లు తప్ప‌నిస‌రిగా పాటించాలని సిఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.

మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్న సీఎం.. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని వెల్లడించారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశించారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని.. మాస్క్‌ ధరించేలా చూడాలని పేర్కొన్నారు. కాగా 50 శాతం ఆక్యుపెన్సీతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version