అధికార వైఎస్సార్ సీపీలో పదవుల పండగ ప్రారంభమైంది. నామినేటెడ్ పదవులను మహిళలకు 50 శాతం ఇస్తామని సీఎం జగన్ ప్రతిపాదించిన తర్వాత.. ఈ పదవుల వేట మరింత పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకు వివిధ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. దీంతో ఆశావహులు అందరూ కూడా మంత్రులను కాకాపట్టే పనిలో మునిగిపోయారు. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్, డైరెక్టరు పోస్టుల నియామకానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. గతంలో టీడీపీ నేతలు కూడా ఈ పదవులు దక్కించుకునేందుకుఅనేక ప్రయాస పడ్డారు.
ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్సార్‌సీపీలోనూ ఈ పదవులు దక్కించుకునేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. పైగా యాభై శాతం మహిళలకు ఇస్తామనే ప్రకటన నేపథ్యంలో మరింత డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఈ విషయంపై కడప, రాజంపేట వైసీపీ అధ్యక్షుడు కె.సురే్‌షబాబు, అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎం పీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాధరెడ్డి తదితరులు చర్చించారు.
చైౖర్మన్ పోస్టులకు, డైరెక్టరు పోస్టులకు చాలా మంది వైసీపీ ఆశావహులు వారి వారి బయోడేటాను సమర్పించారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా వారికి సంబంధించిన నాయకులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించిన ట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 52 బీసీ కా ర్పొరేషన్లు ఉండగా వాటిలో ఎవరిని నియమించాలో, ఏయే జిల్లాలో ఎంత మందికి అవకాశమివ్వా లో ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది.