కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ కు చెందిన 50వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్టు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ సెంటర్లలో ఈ నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్టు రిపోర్టులో తెలిపింది.
కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ కి చెందిన శరణార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ దేశంలో నివాసం ఏర్పరుచుకునేందుకు శరణార్థులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. విదేశీయులు అక్రమంగా కేరళలోకి చోరబడుతున్నట్టు ఏడాది క్రితమే కేంద్ర నిఘా సంస్థ వెల్లడించింది. మల్లపురంలో ఉన్న ఆధార్ కేంద్రంలోకి అక్రమంగా చోరబడి 50 ఆధార్ కార్డులను తయారు చేసినట్టు ఆరోపనలున్నాయి. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు.