మాకు పెళ్లికావాలి..పిల్ల ఏది అంటూ కలెక్టరేట్‌ ఎదుట 50 మంది యువకుల నిరసన..

-

ఒక ఏజ్‌ రాగేనే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా అందరికీ కామన్‌గా అడిగే ప్రశ్న అరే పెళ్లెప్పుడు..మొదట్లో ఇది బానే ఉంటుంది.. పోనూ పోనూ టార్చర్లా అయిపోయేది.. కొంతమందికి ఇది నచ్చితే మరికొంతమందికి పెళ్లిచేసుకోవాలన్నా సరైన పాట్నర్‌ దొరకడం లేదు. అయితే మాకు పెళ్లి కావడం లేదని 50 మంది యువకులు ధర్నాకు దిగారు.. అది కూడా కలెక్టరేట్‌ ముందు.. హైలెట్‌ ఏంటంటే.. వాళ్లు అంతా వరుడి గెటప్స్ వేసుకుని, అచ్చం పెళ్లికొడుకు మండపానికి వచ్చినట్టుగా డోలుబాజాల మధ్య గుర్రంపై ఊరేగుతూ కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నారు. నా వధవు ఏమైందంటూ నిరసన చేశారు.. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెళ్లీడు దాటిపోతున్నా తమకు వధువు దొరకడం లేదని.. ఎన్నాళ్లిలా పెళ్లి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మచారులు ధర్నాకు దిగారు. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే.. సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తి ఉండాల్సిన విధంగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని.. స్త్రీ, పురుష నిష్పత్తిలో వృద్ధి కనిపించేలా ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రి-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్టుని కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌దే అని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు. అందులో భాగంగానే నా వధువు ఏమైందనే నినాదంతో వాళ్లు నిరసన చేశారు. అనంతరం షోలాపూర్ కలెక్టర్‌కి ఒక మెమొరాండం ఇచ్చి అక్కడి నుంచి మళ్లీ ఊరేగింపుగా వెనుదిరిగారు.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం.. మహారాష్ట్రలో స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ రేషియోని పరిశీలిస్తే.. ప్రతీ 1000 మంది పురుషులకు 920 మంది స్త్రీలు మాత్రమే ఉన్నట్లు తేలింది.. బాలికల పట్ల చిన్న చూపు, బ్రూణహత్యలు, బాలికలపై పెరుగుతున్న నేరాలు వంటి అంశాలు ఈ జెండర్ రేషియోలో వ్యత్యాసాలకు కారణం అవుతున్నాయి.. ఇప్పటికైనా మారాలి.. ఆడపిల్ల బరువు కాదు రేపటి భవిష్యతుకు భరోసా అని తెలుసుకోకపోతే.. కొన్నే ఏళ్లకు అబ్బాయిలు పిచ్చోల్లా అయిపోతారు. ఆడపిల్లల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version