సెంట్రల్ బ్యాంక్‌లో 5000 ఖాళీలు… పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటీస్ పోస్ట్‌లు ఖాళీ వున్నాయి. అందుకోసమే నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

5000 పోస్టులు ఖాళీగా వున్నాయి. 20 మార్చి 2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు అయ్యింది. జనరల్ కేటగిరీకి చెందిన 2159 పోస్టులు వున్నాయి. ఎస్సీ 763, ఎస్టీ 416, ఓబీసీ కేటగిరీలో 1162, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 పోస్టులు వున్నాయి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేస్తే… జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకి రూ.800, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రూ.600, మహిళా అభ్యర్థులు రూ.600 పే చెయ్యాలి.

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ని పొందిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు వివరాలని చూస్తే.. వయస్సు 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. కానీ 28 దాటి వుండకూడదు. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవడానికి 03 ఏప్రిల్ 2023 వరకు సమయం వుంది. అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version