దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం..

-

మనుషుల మధ్య వావి వరసలు కూడా లేకుండా పోతున్నాయి. తాజాగా ఒక యువకుడు తన తల్లిని రేప్ చేసి చంపగా ఇప్పుడు ఒక కామాంధుడు సొంత కూతురినే రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన 20 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో పంజాబ్ పోలీసులు లూధియానాలోని ఒక గ్రామానికి చెందిన 54 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ ని అరెస్ట్ చేశారు. గత ఏడాదిన్నరగా తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని నలుగురు కుమార్తెలలో చిన్న కుమార్తె పోలీసులకు ఆశ్రయించింది. ఒక జాతీయ పత్రిక కధనం ప్రకారం బాధితురాలి పెద్దక్కవివాహం చేసుకోగా, ఆమె తన తల్లితో పాటు మిగతా ఇద్దరు సోదరీమణులతో కలిసి నివసిస్తోంది.

తన తల్లి మరియు సోదరీమణులు పని కోసం వెళ్ళినప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. చివరిగా నవంబర్ 15 న ఫూటుగా మద్యం తాగి వచ్చిన ఆమె తండ్రి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు, కాని ఆమె ప్రతిఘటించింది. తరువాత, ఆమె సోదరీమణులు ఇంటికి వచ్చినప్పుడు, బాధితురాలు ఈ సంఘటన గురించి వారికి వివరించింది. ఆ తర్వాత వారు పోలీసు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితుడు తన ఇతర కుమార్తెలపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా అని పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version