దేశ భద్రత కారణాలతో చైనా దేశానికి చెందిన 54 యాప్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు చైనా దేశానికి చెందిన యాప్స్ భద్రతా కారణాలతో బ్యాన్ చేసింది. అయితే తాజా గా 54 యాప్స్ బ్యాన్ చేయడం పై చైనా స్పందించింది. భారత్.. చైనాతో పాటు విదేశీ పెట్టుబడి దారులు అందరితో పారదర్శకంగా వ్యవహరిస్తుందని తాము నమ్ముతున్నామని తెలిపింది. భారత్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వివక్ష పూరితమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అనుకుంటున్నామని తెలిపింది.
చైనా – భారత్ మధ్య ఉన్న సంబంధాలు మెరుగు పర్చుకోవడానికి భారత్ ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించింది. తాము భారత్ తో ఆర్థిక సంబంధాలు ఏర్పర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. భారత్ కూడా వాణిజ్య సంబంధాల మెరుగుదల కోసం చర్యలు చేపడుతుందని నమ్ముతాన్నామని తెలిపింది. కాగ చైనా యాప్స్.. సమాచారం తరలిస్తున్నాయని అలాగే మరి కొన్ని భద్రతా కారణాలతో భారత్ చాలా యాప్స్ ను బ్యాన్ చేస్తుంది.