భారత పార్లమెంట్ సభ్యలును ఉద్దేశిస్తూ.. సింగపూర్ ప్రధానమంత్రి లీ షిన్ లూంగ్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సింగపూర్ పార్లమెంట్లో చర్చ సందర్భంగా ప్రధాని లూంగ్ పార్లమెంట్ లోని ఎంపీలను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసవారు. భారత పార్లమెంట్ లో పార్లమెంట్ దిగువసభలో ఎంపీల్లో సగం మందిపై అత్యాచారం, హత్య వంటి నేరారోపణలు పెండింగ్ లో ఉన్నాయంటూ… అనుచిత వ్యాఖ్యలుచేశారు. ఈ కేసుల్లో ఎక్కువగా రాజకీయ ప్రేరేపితమన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సింగపూర్ హైకమిషనర్ దృష్టికి భారత విదేశాంగ తీసుకెళ్లింది.
చర్చ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూను పొగిడారు ప్రధాని లూంగ్. భారత తొలి ప్రధాని ఇప్పటి తరానికి కూడా స్ఫూర్తి నింపుతున్నారని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ధైర్యాన్ని కలిగి ఉంటారని ప్రజల నాయకుడిగా ఎదుగుతారని.. నెహ్రూ కూడా ఈ కోవలోకే చెందుతాడని లూంగ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన ఓ దిశను చూపించారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో నెహ్రూ పాత్ర కాదనిలేనిదని ఆయన అన్నారు.