ఇది సోషల్ మీడియా కాలం.. ఇక్కడ అగ్గిపుల్ల, సిగ్గుబిల్ల అన్నింటికి డిమాండ్ ఉంటుంది. మీకు ఏది వస్తే అదే బయటపెట్టండి.. దెబ్బకి ఇంటర్నెట్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. డబ్బులు సంపాదించడం కూడా తేలికైన పనే.. నేడు ఎంతో మంది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వారి ప్రతిభను బయటపెట్టి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో ఓ మహిళ తన వంటకాల వీడియోలతో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది..!
చాలా మంది గృహిణులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ వీడియోలను పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. పని కోసం వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరొకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. పనికి కాలపరిమితి లేదు. అందుబాటులో ఉన్నప్పుడు వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. ప్రజలు మంచి కంటెంట్ వీడియోలను చూస్తారు. యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ప్రజల హృదయాలను సంపాదించుకుంటున్న మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యూట్యూబర్ పేరు నిషా మధులిక. ఆమె వంట వీడియోలను పోస్ట్ చేస్తుంది. నిషా మధులికకు యూట్యూబ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నిషా మధులిక పేద పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఒక్కసారి వంట బ్లాగ్ చూసి, వంట మీద మక్కువ పెంచుకుంది. తర్వాత దాన్ని తన వృత్తిగా చేసుకుంది. 54 ఏళ్ల నిషా మధులిక 2007లో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీని తర్వాత ఆమె 2011లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. యూట్యూబ్ ప్రారంభమైన తర్వాత నిషా మధులిక కీర్తి మరింత పెరిగింది. అంతే వెనుదిరిగి చూడలేదు. నిషా యూట్యూబ్ ద్వారా ఇంటింటికీ చేరుకోగలిగింది.
రుచికరమైన వంటలే కాకుండా స్వీట్లు, కేకులు, చాక్లెట్లు వంటి అనేక వంటకాల తయారీకి సంబంధించిన వీడియోలను రూపొందిస్తారు. తన ఛానెల్‌లో 2200 కంటే ఎక్కువ వంట వీడియోలు అప్‌లోడ్ చేసింది. ఇంటర్నెట్ సెలబ్రిటీ చెఫ్ నిషా మధులిక సంపాదించేది తక్కువేమీ కాదు. నిషా మధులిక యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయింది. మీడియా కథనాల ప్రకారం నిషా మధులిక ఆస్తులు దాదాపు రూ.29 కోట్లు. కలలు కనడం మాత్రమే సరిపోదని, దానిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని నిషా మధులిక అంటుంది. వంటల వీడియోల ద్వారా ఇన్ని కోట్లు సంపాదించింది అంటే.. చాలా గొప్ప విషయమే.! ఈ విజయం ఒక్క రోజులో రాలేదు.. కొన్ని సంవత్సరాల కష్టం వల్లనే సాధ్యం అయింది. చాలా మంది.. మనం కూడా యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చేసి ఫేమస్ అవుదాం, డబ్బులు సంపాదిద్దా అని వారం రోజులు ట్రై చేస్తారు.. ఆ తర్వాత పెట్టిన వీడియోలకు లైక్స్, వ్యూస్ రాక డల్ అయిపోయి.. వదిలేస్తారు. ఫలితం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు అదే వస్తుంది.! కానీ మనకు అంత ఓపిక ఉండాలిగా..!!!