కరోనా కలకలం.. ఒక్కసారిగా 55 మంది పోలీసులకు కరోనా పాజిటివ్..!

-

55 police in maharashtra tested with corona positive
55 police in maharashtra tested with corona positive

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడేలా చేసింది.. కానీ ఆ భయాన్ని ఎదురించి ఇంట్లో వాళ్ళకు దూరంగా ఉంటూ ప్రజా శ్రేయస్సు గురించి ప్రజా సేవకుడిలా పనిచేస్తు నిత్యం డ్యూటీ లోనే ఉంటూ మనని కాపాడుతున్నాడు పోలీస్. కానీ ఇవాళ పోలీస్ కి కూడా దినమైన పరిస్థితి వచ్చిపడింది. డ్యూటీ చేస్తూ ఇప్పటికే 4103 మంది పోలీసులు కరోనా భారిన పడ్డారు. ఇక తాజాగా మహారాష్ట్రలో కేవలం గత 24 గంటల్లో 55 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలింది. కేవలం మహారాష్ట్ర లోనే 48 మంది రక్షకభటులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3039 మంది పోలీసులు ఈ వ్యాధి నుండి కొలుకున్నారు. తాజాగా నిన్న కూడా ముంబై లోని సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్‌లో కరోనాతో బాధపడుతూ స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన పోలీస్‌ చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version