‘వు (Vu) టెక్నాలజీస్’ సంస్థ వు సినిమా టీవీ పేరిట భారత్‌లో రెండు నూతన ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. 32, 43 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఐపీఎస్ ఎ ప్లస్ గ్రేడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. బెజెల్ లెస్ డిజైన్‌ను ఏర్పాటు చేయడం వల్ల టీవీలకు ప్రీమియం క్వాలిటీ లుక్ వచ్చింది. ఇక వీటిలో 40 వాట్ల సౌండ్ బార్, డాల్బీ ఆడియో, వాయిస్ అసిస్టెంట్ రిమోట్, ఆండ్రాయిడ్ 9.0 పై తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.
వు సినిమా టీవీ 32, 43 ఇంచ్ టీవీల స్పెసిఫికేషన్లు…
* 32 ఇంచుల టీవీ – 1366 × 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ (హెచ్‌డీ)
* 43 ఇంచుల టీవీ – 1920 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ (ఫుల్ హెచ్‌డీ)
* పీసీ, గేమ్, క్రికెట్ మోడ్స్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్
* 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 9.0, బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్, స్క్రీన్ మిర్రరింగ్
* వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ
* ఈథర్‌నెట్, ఆక్స్, ఆప్టికల్ ఆడియో అవుట్
* నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ యాప్స్
* 40 వాట్ల సౌండ్ బార్, మాస్టర్ స్పీకర్, ట్వీటర్, డాల్బీ ఆడియో, ఆడియో ఈక్వలైజర్
వు సినిమా స్మార్ట్‌టీవీ 32 ఇంచుల మోడల్ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల మోడల్ ధర రూ.21,999గా ఉంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం నుంచి విక్రయించనున్నారు.