మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిలో మొత్తం 554 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఖాళీలు వున్నాయి.
ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ లో మొత్తం 554 ఖాళీలు వున్నాయి. ఇక వాటి విభాగాల గురించి చూస్తే.. పీడియాట్రిక్స్, అనెస్తీషియా, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
వయస్సు విషయానికి వస్తే.. 2022 జులై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. అర్హతల గురించి చూస్తే.. సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. అదే విధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇక శాలరీ గురించి చూస్తే.. నెలకు రూ.53,500 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు వచ్చేసి.. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. పీజీ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 12, 2022. పూర్తి వివరాలను http://hmfw.ap.gov.in/ లో చూడచ్చు.