ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. అలాగే రికవరీలు కూడా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. కాగ నేటి కరోనా బులిటెన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,180 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల ఫలితాల్లో.. కేవలం 69 మందికి మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 3,08,83,049 కు చేరింది. అయితే ఈ రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కాగ గత కొద్ది రోజుల నుంచి కరోనా మరణాలు నమోదు కావడం లేదు. కాగ గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం వెయ్యి లోపే 817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.