పండ్ల వ్యాపారి ఇంట్లో కోటి 7 లక్షలు స్వాధీనం.. ఎలా సంపాదించాడు..?

-

నిర్దిష్ట సమాచారం మేరకు వరంగల్​ శివనగర్​లోని ఓ పండ్ల వ్యాపారి ఇంట్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో… సుమారు కోటి 7 లక్షలు రూపాయాలు బయటపడ్డాయి. నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడం వల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు వేకువజామున జరిపినట్లు మిల్స్​ కాలనీ సీఐ తెలిపారు.

మూడు రోజుల క్రితం.. ఆంధ్రాలో తన స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని ఇంట్లో పెట్టినట్లు వ్యాపారి తెలిపారు. సంబంధిత పత్రాలు చూపించలేకపోయారని పోలీసులు.. డబ్బును సీజ్​ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఐటీ శాఖకు అప్పగించనున్నారు. గత 20 సంవత్సరాలుగా వరంగల్​ పండ్ల మార్కెట్​లో మధుసూదన్​రెడ్డి.. అరటి, మామిడి, దానిమ్మ వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే మొట్టమొదటి అరటిపండ్ల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version