ఆసియా కప్ లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్ కి సిద్ధం అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్ తో సూర్యకుమార్ యాదవ్ సేన తలపడనుంది. ఇప్పటికే పాకిస్తాన్, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన ఇండియా సూపర్-4కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు నామమాత్రపు మ్యాచ్ ను సూపర్ ఫోర్ కి ప్రాక్టీస్ గా ఉపయోగించుకుంది. ఈ మేరకు జట్టులో పలు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్, బూమ్రా, వరుణ్ లకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాcచ్ కోసం ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా…. నిన్న శ్రీలంక వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ జరిగింది. అందులో శ్రీలంక విజయం సాధించింది. దీంతో ఆఫ్గనిస్తాన్ ఇంటికి చేరుకోగా శ్రీలంక సూపర్ ఫోర్ కు వచ్చింది. దీంతో రేపటి నుంచి సూపర్ ఫోర్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇందులో నాలుగు జట్లు పాల్గొంటాయి. ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ నాలుగు జట్లు తలపడనున్నాయి. ఎల్లుండి పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ జరగనుంది. రేపు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది.