ఘోర రోడ్డు ప్ర‌మాదం.. పెళ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం 8 మంది మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉర‌వ‌కొండ మండ‌లం లోని బుద‌గ‌వి వ‌ద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘోర‌ రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది మృతి చెందారు. కాగ కారులో పెళ్లి కి వెళ్లి వ‌స్తుండ‌గా.. ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కాగ కొంత మంది కారులో బ‌ళ్లారిలో పెళ్లికి హాజ‌రు అయ్యారు. అయితే పెళ్లి ముగించుకుని అదే కారులో బ‌ళ్లారి నుంచి అనంతపురం జిల్లా వైపు వ‌స్తున్నారు.

accident

మార్గ మ‌ధ్యంలోని ఉవ‌ర కొండ మండ‌లంలో గ‌ల బుద‌గ‌వి వ‌ద్ద ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పెళ్లికి వెళ్లి వ‌స్తున్న కారును లారీ ఢీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది అక్క‌డిక్క‌డే మృతి చెందారు. కాగ స‌మాచార అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రోడ్డు ప్ర‌మాదం గురించి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతి చెందిన వివ‌రాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అలాగే ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version