టీడీపీ నేత‌పై ఎమ్మెల్యే రోజా ఫైర్‌.. మూతి ప‌గులుతుంద‌ని వార్నింగ్

-

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారుడు గాలి భాను ప్ర‌కాశ్‌రెడ్డి పై చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిప‌డ్డారు. తాను ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటాన‌ని, ఇక్క‌డే చావాల‌ని డిసైడ్ అయ్యాన‌ని అందుకే న‌గ‌రిలో ఇల్లు క‌ట్టుకున్నాను అని రోజా వెల్ల‌డించారు. త‌న‌పై కొంద‌రూ లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు అని, తాను అక్ర‌మంగా సంపాదిస్తున్నార‌ని మాట్లాడితే మూతి ప‌గిలిపోతుంద‌ని గాలి భానుప్ర‌కాశ్‌రెడ్డిని ఉద్దేశించి హెచ్చ‌రించారు.

త‌న బ్యాంకు బ్యాలెన్స్ బ‌హిర్గ‌తం చేస్తాను అని, వైసీపీలో ఉన్న‌వారి అండ‌దండ‌ల‌తో త‌న‌పై గెల‌వాల‌నుకుంటే.. ప‌గ‌టి క‌లే అవుతుంద‌ని సెటైర్లు వేసారు. న‌గ‌రిలో మ‌ట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడిలో ఎమ్మెల్యే రోజా వాటా ఉంద‌ని ఇటీవ‌ల గాలీ భాను ప్ర‌కాశ్ ఆరోపణ‌లు చేశార‌ని ఎమ్మెల్యే అండ‌తో న‌గ‌రి సంప‌ద‌ను కొల్ల‌గొడుతూ ఆంబోతుల్లా న‌గ‌రి మీద ప‌డి దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు రోజా. మ‌రొక‌వైపు గ్రావెల్ దోపిడికి ఎమ్మెల్యే అండ‌గా నిలుస్తున్నార‌ని నాడు త‌న తండ్రి ముద్దుకృష్ణ‌ను చెన్నైకు మ‌ట్టి త‌ర‌లిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటే నేడు ఎమ్మెల్యే రోజా మ‌ట్టి త‌ర‌లింపున‌కు అనుమ‌తులు ఇచ్చారు అని గాలి భాను ప్ర‌కాశ్ విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version