సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఏరియాలో ఉండే 80% మంది ఐటీ ఉద్యోగులు అధిక బరువు (ఒబెసిటీ) సఫర్ అవుతున్నారని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్) వెల్లడించారు.
ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 60% జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారని చెప్పారు. ఇందులో 30% మంది బాడీ ఫ్యాట్ ఎక్కువై ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. చాలా మంది ఫిజికల్ ఎఫర్ట్ పెట్టడం లేదని, దీనికి తోడు మారిన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం పెరిగిపోతుందని.. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు.